ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై అటవీశాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా కడప జిల్లా ప్రొద్దుటూరు సమీపంలోని రామేశ్వరం రిజర్వ్ ఫారెస్ట్‌లో భారీగా ఆక్రమణల కూల్చివేతను చేపట్టారు. రంగంలోకి దిగిన ఫారెస్ట్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు.. అయ్యప్ప స్వామి గుడి వెనుక వైపు ఉన్న అటవీ శాఖ భూమిలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు, జిల్లా కలెక్టర్ ఆదేశాలతోనే కూల్చివేతలు చేపట్టినట్టు సమాచారం. రిజర్వ్ ఫారెస్ట్ స్థలాలను ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని SDFOహెచ్చరించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు.
ప్రొద్దుటూరు సమీపంలోని రామేశ్వరం రిజర్వ్ ఫారెస్ట్‌లో ఆక్రమణల కూల్చివేత
0
48
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


