ట్విషా శర్మ మరణ కేసులో మాజీ న్యాయమూర్తి గిరిబాల సింగ్‌కు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. బుధవారం జబల్‌పూర్‌లో ఈ కేసును విచారిస్తున్న వెకేషన్ జడ్జి దేవనారాయణ్ మిశ్రా కేసులోని వాస్తవాలు , ఆమెపై మోపిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని భోపాల్ సెషన్స్ కోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. వరకట్నం వేధింపులు ఇతర తీవ్రమైన ఆరోపణలకు సంబంధించిన ఈ కేసులో గిరిబాల సింగ్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు అంగీకరించింది. ఆమె పోలీసు యంత్రాగాన్ని , న్యాయ వ్యవస్ధను ప్రభావితం చేస్తున్నారని ట్విషా శర్మ తరపు న్యాయవాదులు తమ పిటిషన్‌లో ఆరోపించారు.
ట్విషా శర్మ కేసులో అత్త గిరిబాల సింగ్ బెయిల్ రద్దు
0
73
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


