రేపు SRH వర్సెస్‌ RCB మ్యాచ్‌.. జోరుగా బ్లాక్ మార్కెట్ దందా

రేపు ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ లవర్స్‌ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. SRH వర్సెస్‌ RCB మ్యాచ్‌కు సిద్ధమైంది. ఉప్పల్‌ స్టేడియంలో ఇదే ఆఖరి మ్యాచ్‌. హై ఇంటెన్సిటీ మ్యాచ్‌ కావడంతో చూసేందుకు క్రికెట్ అభిమానులు పోటీ పడుతున్నారు. ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన 39వేల టికెట్లు క్షణాల్లో మాయమయ్యాయి. ప్రేక్షకుల పోటీ చూసి ఫేక్‌ యాప్స్‌తో కేటుగాళ్లు మాయాజాలం చేస్తున్నారు.

హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్ బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతోంది. సామాన్య క్రికెట్ అభిమానికి ఐపీఎల్ టికెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. బ్లాక్ మార్కెట్‌లో మాత్రం జోరుగా టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. వెయ్యి రూపాయల టికెట్‌ను రూ.5 వేలకు అమ్ముతున్నారు కేటుగాళ్లు. ఇక ఒక్కో కార్పొరేట్ బాక్స్ టికెట్ ధర లక్ష రూపాయలకు చేరింది.

IAS, ఐపీఎస్‌లు కూడా టికెట్ల కోసం లాబీయింగ్ చేస్తున్నారు. మంత్రుల రిఫరెన్స్ పెట్టినా టికెట్లు దొరకడం లేదు. హై ఓల్టేజ్ మ్యాచ్‌ను SRH ఫ్రాంచైజీ క్యాష్‌ చేసుకుంది, భారీగా టికెట్ ధరలను పెంచేసింది. బ్లాక్ మార్కెట్‌లోకి HCA క్లబ్ టికెట్స్ అమ్మకాలు మొదలుపెట్టింది. బ్లాక్ మార్కెట్‌లో అత్యధికంగా కాంప్లిమెంటరీ టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. మొత్తానికి మ్యాచ్ క్రేజ్‌ను HCA, SRH ప్రాంఛైజీ క్యాష్‌ చేసుకుంటున్నాయి.

అటు ఫేక్‌ యాప్‌లు, ఇటు బ్లాక్‌ మార్కెట్లపై పోలీసులు నిఘా పెట్టారు. ఫేక్‌ యాప్‌లను నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్