నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల దందా …శంషాబాద్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ దాడి

శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ అధికారులు నిర్వహించిన దాడిలో నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల అక్రమ దందా బట్టబయలైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అత్తేని కృష్ణ( Atteni Krishna) ను పోలీసులు అరెస్ట్ చేశారు.

దాడుల్లో సుమారు రూ.50 వేల విలువైన 173 ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా ఈ ఇంజెక్షన్లు గుజరాత్‌( Gujarat) నుంచి ఖలేద్ అలీ అలియాస్‌ చ త్రు సింగ్‌( Khaled Ali alias Chatru Singh) సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు.

నిందితుడు అత్తేని కృష్ణ ఈ ఇంజెక్షన్లను డైరీ ఫారమ్ యజమానులకు ఒక్కో బాటిల్‌ను రూ.250 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. పశువుల నుంచి అధికంగా పాలు పిండేందుకు ఈ నిషేధిత ఇంజెక్షన్లను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ వ్యవహారంలో తుక్కుగూడ( Tukkuguda) కు చెందిన సురేష్ అనే వ్యక్తి కూడా కస్టమర్‌గా ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల వినియోగం వల్ల పశువుల్లో సంతానోత్పత్తి సమస్యలు, మాస్టిటిస్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అలాగే ఈ పాలను మనుషులు సేవిస్తే హార్మోన్ల అసమతుల్యత, అకాల యుక్తవయస్సు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిపారు.

పోలీసులు, పశుసంవర్థక శాఖ అధికారులు సంయుక్తంగా ఈ అక్రమ రవాణాపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Latest Articles

ముగిసిన సీఐ నాగరాజు సిట్‌ విచారణ

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజు సిట్‌ విచారణ ముగిసింది. ప్రభుత్వాసుపత్రిలో నాగరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో నాగరాజును 2వ AJS కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు.
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్