భారీ ఆఫర్ కి.. త్రిష నో చెప్పిందా..?

ఇప్పుడు సినీ అభిమానుల్లో.. అలాగే సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు త్రిష. అంతే కాదండోయ్ ఈ చెన్నై బ్యూటీకి ఇప్పుడు భారీగా ఆఫర్స్ వస్తున్నాయి. రెమ్యూనరేషన్ కూడా భారీగా ఇచ్చేందుకు ఓకే అంటున్నారు. ఇదిలా ఉంటే.. రజినీ, కమల్ కాంబోలో రూపొందే క్రేజీ మల్టీస్టారర్ లో నటించేందుకు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా త్రిష నో చెప్పిందట. రజినీ, కమల్.. వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే.. ఆ సినిమా పై ఎంతో క్రేజ్ ఉంటుంది. అలాంటి సినిమాలో ఛాన్స్ వస్తే.. ఎవరైనా ఏమాత్రం ఆలోచించకుండా వెంటన్ ఎస్ చెబతారు. కానీ.. త్రిష నో చెప్పిందట. దీని వెనుక పెద్ద స్టోరీనే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది..? త్రిష ఎందుకు నో చెప్పింది..? దీని వెనకున్న అసలు కారణం ఏంటి..?

త్రిష.. సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకెళుతుంది. ఇంకా చెప్పాలంటే.. ఫస్ట్ ఇన్నింగ్స్ కంటే ఎక్కువ క్రేజ్ తో భారీ ఆఫర్స్ దక్కించుకుంటుండడం విశేషం. రీసెంట్ గా వీరభద్రుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ తెలుగు, తమిళ్ లో పాజిటివ్ టాక్ తో సక్సస్ ఫుల్ గా రన్ అవుతోంది. త్రిష నటించిన తెలుగు మూవీ విశ్వంభర, మలయాళ మూవీ రామ్ త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

ఇక అసలు విషయానికి వస్తే.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, యూనివర్శిల్ హీరో కమల్ హాసన్ కాంబినేషన్‌లో నెల్సన్ దిలీప్‌కుమార్ క్రేజీ మల్టీస్టారర్ రూపొందించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీని ఆగష్టులో సెట్స్ పైకి తీసుకువచ్చేందకుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఇందులో కథానాయికగా త్రిషను తీసుకోవాలి అనుకున్నారు. ఈ మూవీ కోసం ఆమెకు ఏకంగా 12 కోట్ల మేర రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని ప్రచారం జరిగింది కానీ.. తాజా సమాచారం ప్రకారం.. త్రిష ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టుగా కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.

ఇంత భారీ, క్రేజీ మూవీ.. పైగా భారీ రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పినా.. త్రిష ఎందుకు నో చెప్పిందంటే.. ఈ సినిమాను నిర్మిస్తున్న సంస్థల్లో ఒకటైన రెడ్ జెయింట్ మూవీస్ మాజీ సీఎం స్టాలిన్ కుటుంబానికి చెందినది కావడం.. కమల్ హాసన్ మరో నిర్మాతగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత తమిళనాడు రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ప్రతిపక్షంలో ఉన్న ఉదయనిధి సంస్థలో సినిమా చేయవద్దని సీఎం విజయ్.. త్రిషకు సూచించినట్లుగా ప్రచారం జరుగుతుంది. మరో వైపు కమల్ హాసన్ తో కలిసి త్రిష నటించిన మన్మధ బాణం, చీకటి రాజ్యం, థగ్ లైఫ్ చిత్రాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఈ సెంటిమెంట్ ను కూడా దృష్టిలో పెట్టుకునే త్రిష నో చెప్పిందని టాక్ వినిపిస్తోంది. మరి.. ప్రచారంలో ఉన్న వార్తల పై క్లారిటీ త్వరలో ఇస్తారేమో చూడాలి.

Latest Articles

నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల దందా …శంషాబాద్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ దాడి

శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ అధికారులు నిర్వహించిన దాడిలో నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల అక్రమ దందా బట్టబయలైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అత్తేని కృష్ణ( Atteni Krishna) ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాడుల్లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్