హైదరాబాద్‌లో హృదయాన్ని కదిలించిన ఘటన.. పోలీసుల చొరవతో తల్లీబిడ్డలకు కొత్త జీవితం

హైదరాబాద్ నగరంలో హృదయాన్ని కదిలించే ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, భర్త నిర్లక్ష్యం, పుట్టింట్లో ఎదురైన అవమానాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. హుస్సేన్‌సాగర్‌లో దూకి ప్రాణాలు తీసుకోవాలని భావించిన ఆమె జీవితంలో చివరి క్షణంలో జరిగిన పరిణామం కొత్త మలుపు తిప్పింది.

సమాచారం ప్రకారం, తీవ్ర నిరాశలో ఉన్న ఆమె ఇద్దరు పిల్లలను తీసుకుని హుస్సేన్‌సాగర్ వైపు వెళ్లింది. అదే సమయంలో మార్గమధ్యంలో కనిపించిన రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ బోర్డు ఆమెను ఒక్కసారిగా ఆలోచనలో పడేసింది. చివరకు ధైర్యం చేసి పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లింది.

స్టేషన్‌లో ఆమె పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే స్పందించారు. ముందుగా ఆకలితో ఉన్న తల్లీబిడ్డలకు ఆహారం అందించి, ఆమెకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆమెతో మాట్లాడి సమస్యల గురించి తెలుసుకున్నారు.

భర్త వదిలేయడం, పుట్టింట్లో అవమానాలు ఎదురుకావడం వల్ల తీవ్రంగా కుంగిపోయిన ఆమెకు పోలీసులు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించారు. “చావు సమస్యలకు పరిష్కారం కాదు.. పిల్లల భవిష్యత్తు కోసం మీరు ధైర్యంగా నిలబడాలి” అంటూ ఆమెకు మానసికంగా ధైర్యానిచ్చారు.

అనంతరం ఆమెను సఖి సెంటర్‌కు తరలించి, అవసరమైన పూర్తి సహాయం అందించేలా చర్యలు చేపట్టారు. పోలీసుల మానవత్వం, సమయస్ఫూర్తి కారణంగా ముగ్గురి ప్రాణాలు నిలిచాయని స్థానికులు ప్రశంసిస్తున్నారు.

Latest Articles

వరంగల్ మేయర్‌ పీఠంపై బండి సంజయ్‌ ఫోకస్‌.. జీహెచ్‌ఎంసీలో ప్రచారం లేనట్టేనా?

హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్