28.7 C
Hyderabad
Friday, May 15, 2026
spot_img

బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే…

భారతీయుల జీవితంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వంటి సందర్భాల్లో పసిడికి భారీగా డిమాండ్ ఉంటుంది. మన సంప్రదాయాలు, ఆచారాలతో బంగారం ఎంతో దగ్గరగా ముడిపడి ఉంది. అంతేకాదు, భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కూడా బంగారం సురక్షితమైన ఆప్షన్‌గా భావిస్తారు. ఇదే సమయంలో వెండికీ మార్కెట్‌లో మంచి గిరాకీ కొనసాగుతోంది. ఆభరణాలు, పరిశ్రమలు, పెట్టుబడుల కోసం వెండిని పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నారు.

అందుకే బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు జరిగే మార్పులను తెలుసుకోవడం కొనుగోలుదారులకు ఎంతో ముఖ్యంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ మారకం విలువ, డిమాండ్ ఆధారంగా ఈ ధరలు మారుతూ ఉంటాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.

హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్లు రూ.1, 65, 940 , 22 క్యారెట్లు రూ. 1,48,450గా ఉంది. వెండి కిలో రూ.2,88, 341గా ఉంది. ఇక విజయవాడలో బంగారం 24 క్యారెట్ల ధర రూ. 1,61, 210, 22 క్యారెట్లు రూ. 1,49, 080, కిలో వెండి ధర రూ, 2, 95, 000 పలుకుతోంది. ఇక ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,56,500, 22 క్యారెట్ల బంగారం ధర 1,43, 980, కిలో వెండి ధర రూ. 2,76,000 పలుకుతోంది. ఇక రాజమండ్రిలో 24 క్యారెట్ల బంగారం ధర 1,62,330, 1,48, 800, కిలో వెండి ధర 3,15,000 గా ఉంది. విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,61, 430, 22 క్యారెట్లు రూ. 1, 48,000, కిలో వెండి ధర రూ. 2,96, 000గా ఉంది. అలాగే తమిళనాడులో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,50,00, కిలో వెండి ధర రూ.3, 15, 000గా పలుకుతోంది.

Latest Articles

ఎందుకు చిప్స్ ప్యాకెట్లలో గాలి నింపి ఉంటుంది? అసలు నిజం ఇదే!

మనకు ఇష్టమైన చిప్స్ ప్యాకెట్ కొనుగోలు చేసి తెరిచినప్పుడు అందులో సగం వరకు మాత్రమే చిప్స్ ఉండి, మిగతా భాగం మొత్తం గాలితో నిండిపోయి ఉండటం చూసి చాలా మందికి నిరాశ కలుగుతుంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్