వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు

డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఆయనకు సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేస్తూ రాజమండ్రి ప్రత్యేక న్యాయస్థానం సంచలన ఆదేశాలు జారీ చేసింది. బెయిల్‌పై బయట ఉన్న అనంతబాబు.. ఈ కేసులోని నలుగురు సాక్షులను ప్రలోభపెట్టడంతో పాటు, తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే చంపుతానని బెదిరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు ఏప్రిల్‌ 24న అనంతబాబును అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.

హత్యకేసులో బెయిల్‌పైఉంటూ సాక్షులను బెదిరించడాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు.. ఆధారాలతో నిరూపణ కావడంతో బెయిల్‌ రద్దు చేసింది

పోలీసుల తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు వాదనలు వినిపించారు. బెయిల్ రద్దుతో హత్య కేసు విచారణ పూర్తయ్యే వరకు అనంతబాబు జైలులోనే ఉండనున్నారు. ఈ నెల20 నుంచి డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసు రెగ్యులర్ విచారణ ప్రారంభించనున్నట్లు న్యాయస్థానం తెలిపింది.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్