సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ సంచలనం సృష్టించాడు. తమిళ రాజకీయాల్లో అసాధ్యమనుకున్నది సుసాధ్యం చేసి చూపించారు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన కేవలం రెండేళ్ల రెండు నెలల వ్యవధిలోనే మెజార్టీ స్థానాల్లో గెలుపొంది అటు సినిమాల్లోనే కాదు ఇటు పాలిటిక్స్ లోనూ హీరో అనిపించుకున్నారు. చెన్నై జిల్లాలోని పెరంబూర్, తిరుచ్చి జిల్లాలోని తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి బరిలో దిగిన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్… తన ప్రత్యర్థులను చిత్తుగా ఓడించారు. పెరంబూర్‌లో డీఎంకే అభ్యర్థి ఆర్డీ శేఖర్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించగా.. తిరుచ్చి ఈస్ట్‌లోనూ అదే పార్టీ అభ్యర్థి ఇరుదయరాజ్‌పై గెలుపొంది విజిల్ మోత మోగించారు.


