కిషన్‌ రెడ్డి ఆదేశాలతో అంబర్‌పేట్‌ ఫ్లైఓవర్‌పై రాకపోకలు ప్రారంభం

హైదరాబాద్‌ నగరం రోజురోజుకీ విస్తరిస్తోంది. జనాభా కూడా పెరిగిపోతోంది. అందుకు తగినట్టుగా ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువవుతోంది. ఇక పీక్స్‌ సమయంలో అయితే రోడ్లమీద ట్రాఫిక్‌ జామ్‌తో వాహనదారులు అల్లాడిపోవాల్సిన పరిస్థితి. అందుకే నగరంలో ఫ్లైఓవర్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి.

హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వచ్చింది. స్థానిక పార్లమెంట్ సభ్యుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశంతో అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌పై రాకపోకలు ప్రారంభమయ్యాయి. అంబర్‌పేట్ ఫ్లై ఓవర్ పై బుధవారం నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి. కిషన్ రెడ్డి ఆదేశంతో అంబర్‌పేట్ ఫ్లైఓవర్ పై రాకపోకలు కొనసాగుతున్నాయి.

దాదాపుగా ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి. అయితే కింద భాగాన రోడ్డు నిర్మాణం, గ్రీనరీ, బ్యూటిఫికేషన్ కార్యక్రమాలను పూర్తి చేసి అధికారికంగా మరికొన్ని రోజుల్లో ఫ్లైఓవర్ ప్రారంభించనున్నారు.

అంతవరకు నగరవాసుల సౌకర్యార్థం శివరాత్రి నుంచి ఈ బ్రిడ్జ్ పై రాకపోకలను అనుమతించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఫ్లై ఓవర్ పనులను పర్యవేక్షించారు. కేంద్రమంత్రి ఆదేశాలతో ఇవాళ్టి నుంచి బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

అంబర్‌పేట్ ఫ్లై ఓవర్ దశాబ్దాల కల. దీనికోసం చాన్నాళ్లుగా స్థానికులు, ఈ మార్గంలో రోజూ ప్రయాణించే వారు ఎదురుచూస్తున్నారు. అయితే కిషన్ రెడ్డి చొరవతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవడం, శివరాత్రి సందర్భంగా అందుబాటులోకి రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కిషన్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేశారు.

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్