కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కోరింగ పంచాయతీ పరిధిలోని సీతారామపురం, తాళ్లరేవు పంచాయతీల్లోని కేశవపురం రేవు వద్ద నుంచి ఏ అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. దీని వెనుక మండల టీడీపీ నేతలతో పాటు , నియోజకవర్గ బడా టీడీపీ నేత హస్తం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గోదావరి పాయలో ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు జరిపి ఈ అక్రమ రవాణా సాగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానిక తహశీల్ధార్ త్రినాధ్ ని వివరణ కోరితే, తనకు ఇందులో ఏ సంబంధం లేదని ఆయన చెప్పినట్టు తెలిసింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తాళ్లరేవు మండలంలో జోరుగా ఇసుక అక్రమ రవాణా
0
331
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


