డైరెక్టర్‌ ఆర్జీవీకి సీఐడీ నోటీసులు

సంచలన డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇవాళ సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు రాలేనని ఆర్జీవీ సీఐడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉండటం వల్ల విచారణకు హాజరు కాలేనని.. ఈ నెల 28న సినిమా విడుదల ఉండటంతో తీరిక లేదని పేర్కొన్నారు. తనకు 8 వారాల సమయం కావాలని, ఆ తర్వాత తేదీ ఇస్తే విచారణకు వస్తానని సీఐడీ ఇన్‌స్పెక్టర్ తిరుమలరావును కోరారు. అయితే.. సీఐడీ అధికారులు ఆయన వినతి మేరకు 8 వారాల సమయం ఇస్తారా.. లేదా మరోసారి నోటీసులు జారీ చేస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

కాగా.. 2019లో రామ్‌గోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతో ఓ సినిమా తీశారు. ఆ మూవీపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేయడంతో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే పేరుతో సినిమాను విడుదల చేశారు. ఈ సినిమాను యూట్యూబ్‌లో మాత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరిట విడుదల చేశారని గుంటూరు జిల్లాకు మంగళగిరి సమీపంలోని ఆత్మకూర్‌కు చెందిన వంశీకృష్ణ బండారు సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్