‘వారధి’ మూవీ సెన్సార్ పూర్తి

తెలుగు తెరపైకి మరో యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతుంది. రాధాకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై, పెయ్యాల భారతి, ఎం.డి. యూనస్ నిర్మాతలుగా, అనిల్ అర్కా – విహారికా చౌదరి హీరోహీరోయిన్లుగా, శ్రీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘వారధి’. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సర్ సభ్యులు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసి చిత్ర యూనిట్ ను అభినందించారు.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీ కృష్ణ మాట్లాడుతూ, “ఈ కథ యూత్‌ను ఎట్రాక్ట్ లవ్, రొమాన్స్, థ్రిల్లర్ ఉండటంతో అందరిని ఆకట్టుకుంటుందని, ప్రేక్షకులందరికీ నచ్చే కథను అందించామనే నమ్మకం ఉందని తెలిపారు. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ సినిమా సాంకేతిక నిపుణుల కృషి, కథా కథనాల ప్రత్యేకత, నటీనటుల అభినయం చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తాయని చిత్ర యూనిట్ పేర్కొంది. ‘వారధి’లో ప్రేమ, భావోద్వేగాలు, సస్పెన్స్ అంశాలను కలిపి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే ప్రయత్నం చేశారు. ‘వారధి’ సినిమా ఈ తరానికి స్పెషల్ ట్రీట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

 

సమర్పణ: వెబ్జీయార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్

బ్యానర్: రాధాకృష్ణ ఆర్ట్స్

చిత్ర శీర్షిక: వారధి

జానర్: ప్రేమ, రొమాన్స్, థ్రిల్లర్, డ్రామా

 

నటీనటులు:

హీరో: అనిల్ అర్కా

హీరోయిన్: విహారికా చౌదరి

ప్రతినాయక పాత్ర: ప్రశాంత్ మడుగుల

ప్రధాన పాత్ర: రిధి

 

సాంకేతిక బృందం:

కథ & దర్శకత్వం: శ్రీ కృష్ణ

నిర్మాతలు: పెయ్యాల భారతి, ఎం.డి. యూనస్

రచయిత: నాగేంద్ర పలగాని

సినిమాటోగ్రఫీ: శక్తి .జె కె

సంగీత దర్శకుడు: షారుఖ్ షేక్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి.ఎన్. చందు

పీఆర్ఓ: కడలి రాంబాబు, దయ్యాల అశోక్.

Latest Articles

కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో బొత్స భావోద్వేగం

విజయనగరం జిల్లా చీపురుపల్లి కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి లోనయ్యారు. సమావేశంలో కన్నీరుపెట్టుకున్నారు. తన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు పార్టీ మార్పుపై సమావేశంలో ప్రస్తావన వచ్చింది. శ్రీనుతో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్