కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలని..మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు అడుగుతున్నారని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటనే ఉద్యోగులు అడుగుతున్నారని తెలిపారు. ఉద్యోగులది గొంతమ్మ కోరిక కాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉంటుందని, వారి సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తామని పేర్కొన్నారు. ఎగవేతల రేవంత్‌రెడ్డి అంటే తనపై రెండు కేసులు పెట్టారని హరీష్ రావు విమర్శించారు.
అంతకుముందు తెలంగాణ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సంఘం కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. ఈనేపథ్యంలోనే ఉద్యోగులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తామని, విద్యకు బడ్జెట్‌లో 15 శాతం పెడతానని 7 శాతం పెట్టి మోసం చేశారని విమర్శించారు. హాస్టల్లో విద్యార్థులను హాస్పిటల్ పాలు, ఉద్యోగులను రోడ్డు పనులు చేశారని మండిపడ్డారు.. హాస్టల్లో అన్నం తిని 49 మంది పిల్లలను పొట్టుకున్న చరిత్ర రేవంత్‌రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి, ఓట్లు వేసుకొని గద్దెనెక్కిన తర్వాత అమలు చేయమని అడుగుతున్నారు. ఉద్యోగులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి ప్రశ్నించాలన్నారు.