హల్దీ వేడుకల్లో నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల

నటుడు నాగచైతన్య – నటి శోభితా ధూళిపాళ్ల మరికొన్ని రోజుల్లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా ఈ జంటకు హల్దీ వేడుక జరిగింది. కాబోయే వధూవరులను ఒకేచోట ఉంచి ఈ వేడుక నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలో కుటుంబసభ్యులతోపాటు అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. ఈ జంటకు మంగళస్నానాలు చేయించి అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన కొన్ని దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. డిసెంబర్‌ 4న చైతన్య – శోభిత వివాహం జరగనుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ పెళ్లి తంతు నిర్వహించనున్నారు. దీని గురించి ఇటీవల చైతన్య మాట్లాడారు. శోభితతో జీవితాన్ని పంచుకునేందుకు తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు.

పెళ్లి చాలా సింపుల్‌గా, సంప్రదాయబద్ధంగా జరగనుంది. ఈ వేడుకల్లో ఆర్భాటాలకు తావు లేదని ఇప్పటికే నాగ చైతన్య చెప్పారు. ఉత్సాహంగా పనులు జరుగుతున్నాయని అన్నారు. గెస్ట్‌ లిస్ట్‌, పెళ్లికి సంబంధించిన ఇతర విషయాలను ఇద్దరం కలిసి నిర్ణయిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలోని అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగా పెళ్లి జరగనుంది. ANR ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలనే ఉద్దేశంతో ఇరు కుటుంబాలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయని నాగచైతన్య అంటున్నారు. శోభితతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆశగా ఎదురుచూస్తున్ననని చెప్పారు. తనతో నేనెంతగానో కనెక్ట్‌ అయ్యానని ఓ ఇంగ్లీష్‌ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య అన్నారు.

Latest Articles

నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ

మేడ్చల్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్