నవరాత్రుల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన దైవ భక్తిని చాటుకున్నారు. ఈ ఏడాది గర్భా నృత్యంపై ప్రధాని ఓ పాటను రాశారు. ఈ పాటను గాయని పూర్వా మంత్రి ఆలపించారు. తాజాగా ఆ సాంగ్‌కు చెందిన వీడియోను తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దుర్గామాతను సమర్పించిన ఆ గీతం అందర్నీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ సాంగ్ వైరల్ అవుతోంది. మంగళకరమైన నవరాత్రి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ప్రజలు భిన్నరూపాల్లో జరుపుకుంటారని.. ప్రజలందరూ దుర్గామాత భక్తితో ఏకం అయ్యారని ప్రధాని మోదీ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేశారు. ఆ భక్తి పారవశ్యంతో దుర్గాదేవి శక్తి, కరుణకు నివాళిగా గర్భా గీతాన్ని రాసిట్లు ప్రధాని తెలిపారు. ఆ తల్లి దీవెనలు మనందరిపై ఉండాలని ఆశిస్తున్నట్లు తన ట్వీట్‌లో మోదీ కోరారు.
నవరాత్రుల సందర్భంగా తన భక్తిని చాటుకున్న ప్రధాని
0
178
Previous article
Latest Articles
ప్రశ్న రావణ్ పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై సోషల్ మీడియాలో అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ప్రశ్న రావణ్ పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. ఈ...
- Advertisement -
- Advertisement -


