29.2 C
Hyderabad
Tuesday, November 5, 2024
spot_img

నవరాత్రుల సందర్భంగా తన భక్తిని చాటుకున్న ప్రధాని

నవరాత్రుల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన దైవ భక్తిని చాటుకున్నారు. ఈ ఏడాది గర్భా నృత్యంపై ప్రధాని ఓ పాటను రాశారు. ఈ పాటను గాయని పూర్వా మంత్రి ఆలపించారు. తాజాగా ఆ సాంగ్‌కు చెందిన వీడియోను తన ఎక్స్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. దుర్గామాతను సమర్పించిన ఆ గీతం అందర్నీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఆ సాంగ్‌ వైరల్‌ అవుతోంది. మంగళకరమైన నవరాత్రి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ప్రజలు భిన్నరూపాల్లో జరుపుకుంటారని.. ప్రజలందరూ దుర్గామాత భక్తితో ఏకం అయ్యారని ప్రధాని మోదీ తన ఎక్స్‌ అకౌంట్‌లో పోస్టు చేశారు. ఆ భక్తి పారవశ్యంతో దుర్గాదేవి శక్తి, కరుణకు నివాళిగా గర్భా గీతాన్ని రాసిట్లు ప్రధాని తెలిపారు. ఆ తల్లి దీవెనలు మనందరిపై ఉండాలని ఆశిస్తున్నట్లు తన ట్వీట్‌లో మోదీ కోరారు.

Latest Articles

కొనసాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఇప్పటికే ఓ చిన్న కౌంటీలో కౌంటింగ్‌ కూడా పూర్తయ్యింది. న్యూహ్యాంప్‌షైర్‌ రాష్ట్రంలోని డిక్స్‌విల్లే నాచ్‌లో తొలి ఫలితం కూడా వచ్చేసింది. అక్కడ మొత్తం ఆరుగురు ఓటర్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్