ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా అస్వస్థతకు గురయ్యారన్న వార్త వైరల్ అయింది. అయితే,.. తన ఆరోగ్యంపై వదంతులు నమ్మవద్దంటూ తానే స్వయంగా తెలిపారు రతన్ టాటా. సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆస్పత్రికి వెళ్లినట్ట క్లారిటీ ఇచ్చారు. నా ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు రతన్ టాటా.
రతన్ టాటా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని.. చికిత్స కోసం ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రికి తరలించారని వార్తలు వచ్చాయి. ఒక్కసారిగా బీపీ పడిపోవడంతోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారని.. దీంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారన్న న్యూస్ వైరల్ అయింది. ఈ విషయం తన వరకూ చేరేసరికి తను బాగానే ఉన్నానని.. ఆరోగ్యంపై వదంతులు నమ్మవద్దని తెలిపారు రతన్ టాటా.