రేవంత్ సర్కార్‌పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా.. ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకం అమలుకు నోచుకోలేదని అన్నారు. రేవంత్ సర్కార్ పరిపాలనపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. మింగ మెతుకు లేదు.. కానీ మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావాలె అన్నట్టునది రేవంత్ వైఖరి అని కేటీఆర్ విమర్శించారు. తెల్లారి లేస్తే బీద అరుపులు. రాష్ట్రం అప్పులపాలైంది అని, డబ్బులు లేవని. మరొకవైపు మూసీ పేరిట ఈ లక్ష యాభై వేల కోట్ల సోకులు, ఆర్భాటం ఎవరికోసం అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా రేవంత్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేటీఆర్ మరోసారి గుర్తు చేశారు.