గోపీచంద్ ‘విశ్వం’ నుంచి హార్ట్ టచ్చింగ్ సాంగ్ రిలీజ్

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. రీసెంట్ గా రిలీజైన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెంచింది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను దోనేపూడి చక్రపాణి స‌మ‌ర్ప‌ణ‌లో చిత్రాలయం స్టూడియోస్‌, పీపుల్ మీడియా బ్యాన‌ర్స్‌పై వేణు దోనేపూడి, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఫస్ట్ సింగిల్ ‘మొరాకో మగువా’కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో మ్యూజికల్ ప్రమోషన్స్ చార్ట్ బస్టర్ నోట్ లో స్టార్ట్ అయ్యాయి. మంగ‌ళ‌వారం ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ‘మొండి తల్లి పిల్ల నువ్వు’ సాంగ్ ని రిలీజ్ చేశారు. చేతన్ భరద్వాజ్ మదర్ ఎమోషన్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసే హార్ట్ టచ్చింగ్ నంబర్ గా ఈ సాంగ్ ని కంపోజ్ చేశారు.

‘అడుగే తడబడితే.. ఇదిగో.. నీ వెనకే ఉంటానులే.. చిన్నారి తల్లి! కలకో భయపడకు.. ఎపుడూ.. నీ కునుకై ఉంటానులే ..చిన్నారి తల్లి! మొండి తల్లి పిల్ల నువ్వు’ అంటూ శ్రీ హర్ష ఈమని రాసిన లిరిక్స్ మనసుని హత్తుకున్నాయి. సాహితీ చాగంటి తన లవ్లీ వోకల్స్ తో కట్టిపడేశారు.

మదర్, డాటర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సాంగ్ కథలోని ఎమోషనల్ డెప్త్ ని తెలియజేస్తోంది. ఈ పాటలో పాపతో హీరో గోపిచంద్ కు వున్న బాండింగ్ ని రివిల్ చేయనప్పటికీ వారి మధ్య వుండే ఎమోషన్ చాలా క్యురియాసిటీని పెంచింది. ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి కెవి గుహన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. ఎడిటర్‌గా అమర్‌రెడ్డి కుడుముల, ఆర్ట్‌ డైరెక్టర్‌ కిరణ్‌ మన్నె. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.

Latest Articles

సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్

శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్