హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా ఆదేశాల మేరకు అనుమతులకు మించి నిర్మించిన నాలుగు అంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్నారు. అమీన్ పూర్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారి పవన్ ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు.
జీ ప్లస్ 2 కోసం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ నుంచి అనుమతులు తీసుకుని అదనంగా రెండు అంతస్తులను నిర్మించడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. నోటీసులిచ్చి జేసీబీలతో కూల్చివేస్తున్నట్లు టౌన్ ప్లానింగ్ అధికారి పవన్ తెలిపారు. అక్రమ నిర్మాణాలను సహించేది లేదని స్పష్టం చేశారు. మున్సిపల్ పరిధిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టిన కూల్చివేతలు తప్పవని హెచ్చరించారు.