సమస్యల వలయంలో గురుకులాలు – హరీశ్‌రావు

రాష్ట్రంలోని ఐటీఐ కాలేజీలు, గురుకులాల్లో కనీస వసతులు లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం దుర్మార్గమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. పెద్దపల్లి, సంగారెడ్డి, అదిలాబాద్.. ఇలా రాష్ట్రంలో ఎక్కడి ఐటీఐల పరిస్థితి చూసినా అధ్వాన్నంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పారిశుద్ధ్య నిర్వహణ లేక, టాయిలెట్స్, అవసరమైన సిబ్బంది లేక విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారని చెప్పారు. లైబ్రరీలో కంప్యూటర్లు, ఇతర యంత్రాలు, పనిముట్లు పనిచేయడం లేదన్నారు. దీంతో విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయలేకపోతున్నారని వెల్లడించారు. కొన్ని చోట్ల ఐటీఐ తరగతుల్లోకి వాన నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

తెలంగాణలో గురుకులాల పరిస్థితి నానాటికీ దిగజారుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కలుషిత ఆహారంతో విద్యార్థుల అస్వస్థత, పాము కాటుకు విద్యార్థి మృతి, డెంగీ జ్వరంతో విద్యార్థి దుర్మరణం వంటి వార్తలు రాష్ట్రంలో నిత్యకృత్యం అయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. అత్యధిక ప్రాంగణాలు దోమలు, ఈగలతో మురికి కూపాలుగా ఉన్నాయని తెలిపారు. స్నానాల గదులకు డోర్లు కూడా లేని పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. సరిపడా బాత్‌రూంలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్