బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జూబ్లీ హిల్స్ క్యాంపస్‌లో గిరిజన జీవనోపాధి పద్ధతులు – సాధికారత, సమస్యలు అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. సహజ వనరులు అపారంగా వున్న అడవులను కొల్లగొడుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. అడవులను ఆదివాసులు విధ్వంసం చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మైనింగ్ కంపెనీలు, కార్పొరేట్లు అడవులను నాశనం చేస్తున్నాయన్నారు. అడవులు మిగలడానికి ఆదివాసీలు, అడవి బిడ్డలే కారణమని.. అడవుల ఆధారంగా బతికే గిరిజనులు అడవులను ఎప్పుడూ నాశనం చేయరని చెప్పారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో చట్టాలు ఉన్నా అనుకున్న స్థాయిలో ఆ జాతుల అభివృద్ధి జరగలేదన్నారు.
సహజ వనరులు అపారంగా వున్న అడవులను కొల్లగొడుతున్నారు – సీతక్క
0
299
Next article
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


