పడిపోయిన సినిమా చెట్టును చూసి భావోద్వేగానికి గురయ్యారు డైరెక్టర్ వంశీ. చెట్టుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఏంటా చెట్టు?.. చెట్టును చూసి వంశీ ఎందుకు భావోద్వేగానికి గురయ్యారు. ఆ చెట్టు ఎక్కడుంది?
గోదావరి గట్టు చూస్తే గుర్తొచ్చేది డైరెక్టర్ వంశీ పేరే. గోదావరి గట్టు, చెట్లు దగ్గర ఏదో ఒక సీన్ తీయడం ఆయన ప్రత్యేకత. అలా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలోని సినిమా చెట్టుతో అనుబంధం పెంచుకున్నారు. వంశీ 22 సినిమాలకు దర్శకత్వం వహించారు. అందులో సుమారు 18 సినిమాల్లో కుమారదేవంలోని సినిమా చెట్టుకింద ఏదో ఒక సీన్ తీశారు. అలా చెట్టుతో అనుబంధం పెంచుకున్న వంశీ.. చెట్టు పడిపోవడం చూసి కాస్తంత భావోద్వేగం చెందారు.ట్టు పడిపోవడం చూసి కాస్తంత భావోద్వేగం చెందారు.