10 డిమాండ్లను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చిన తులసిరెడ్డి

రాళ్లసీమగా మారిపోయిన రాయలసీమ సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టిపెట్టాలని కాంగ్రెస్ సీనియర్‌ నేత తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అమరావతిపై చూపుతున్న శ్రద్ధలో కనీసం పదవ వంతైనా సీమ వాసి అయిన చంద్రబాబు పెట్టాలన్నారు. ఒకప్పుడు రతనాలసీమగా పేరుగాంచిన రాయలసీమ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల రాళ్ళసీమగా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుందేల్‌ఖండ్ తరహాలో రాయలసీమ, ఉత్తరాంధ్రకు ఇవ్వాల్సిన నిధులు రప్పించి అభివృద్ధి చేయాలన్నారు. ఇలా మొత్తం 10 డిమాండ్లను సీఎం చంద్రబాబు దృష్టికి తులసిరెడ్డి తీసుకెళ్లారు. వాటిలో కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, సీమలో హైకోర్టు లేదా హైకోర్టు బెంచ్‌, ఏపీలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు తదితర అంశాలను తులసిరెడ్డి ప్రస్తావించారు.

Latest Articles

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్