రాళ్లసీమగా మారిపోయిన రాయలసీమ సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టిపెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అమరావతిపై చూపుతున్న శ్రద్ధలో కనీసం పదవ వంతైనా సీమ వాసి అయిన చంద్రబాబు పెట్టాలన్నారు. ఒకప్పుడు రతనాలసీమగా పేరుగాంచిన రాయలసీమ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల రాళ్ళసీమగా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుందేల్‌ఖండ్ తరహాలో రాయలసీమ, ఉత్తరాంధ్రకు ఇవ్వాల్సిన నిధులు రప్పించి అభివృద్ధి చేయాలన్నారు. ఇలా మొత్తం 10 డిమాండ్లను సీఎం చంద్రబాబు దృష్టికి తులసిరెడ్డి తీసుకెళ్లారు. వాటిలో కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, సీమలో హైకోర్టు లేదా హైకోర్టు బెంచ్, ఏపీలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు తదితర అంశాలను తులసిరెడ్డి ప్రస్తావించారు.