డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్ కాల్‌తో పశ్చిమగోదావరి జిల్లా యువతి మిస్సింగ్ మిస్టరీ వీడింది. 9 నెలల క్రితం తన కుమార్తె కనిపించడం లేదని ప్రజాదర్బార్‌లో పవన్‌ను కలిసిన ఆమె తల్లి గోడు వెళ్లబోసుకుంది. యువతిని కనిపెట్టాలని పవన్‌కు విజ్ఞప్తి చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపింది. వెంటనే పవన్ కళ్యాణ్ మాచవరం సీఐకి ఫోన్ చేశారు. యువతి ఆచూకీ కనుగొనాలని ఆదేశించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశారు. ఇన్‌స్టా గ్రామ్ మెస్సేజ్‌ల ద్వారా యువతిని కనిపెట్టారు. ఆమె జమ్ముకశ్మీర్ లో మరో యువకుడితో ఉన్నట్లు గుర్తించారు. ప్రేమ పేరుతో యువతిని పలు ప్రాంతాలకు తిప్పినట్టు కనిపెట్టారు. యువతితో పాటు యువకుడు అంజాద్‌ను విజయవాడ తీసుకొచ్చారు. ఇవాళ తల్లికి యువతిని అప్పగించనున్నారు పోలీసులు.
పవన్ కళ్యాణ్ ఫోన్ కాల్‌తో వీడిన యువతి మిస్సింగ్ మిస్టరీ
0
232
Previous article
Next article
Latest Articles
పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు
తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో సమావేశమైన ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందేనని...
- Advertisement -
- Advertisement -


