లక్డీకాపూల్ వాసవి ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగం క్యాత్ ల్యాబ్ ఇన్చార్జి కుంభం కనకారెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఆసుపత్రికి మద్యం సేవించి వచ్చాడంటూ శుక్రవారం నాడు కనకారెడ్డని నర్సింగ్ ఇన్చార్జి శాంతి చితకబాది, అవమానించారు. దీంతో మనస్థాపానికి గురైన కనకారెడ్డి తెల్లవారు జామున అనుమానాస్పదంగా మరణించాడు. కనకారెడ్డిని ఆసుపత్రి నుండి పంపించామని, అతనికి ఏం జరిగినా తమకు సంబంధం లేదంటూ అతని భార్యకు ఆసు పత్రి యాజమాన్యం మెసేజ్ చేయడం అనుమానంగా ఉందని బంధువులు అన్నారు. వాసవి ఆసు పత్రి ముందు కనకారెడ్డి మృతదేహంతో భార్య, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.
లక్డీకాపూల్ వాసవి ఆసుపత్రిలో ఉద్యోగి కనకారెడ్డి అనుమానాస్పద మృతి
0
216
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


