హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ చౌరస్తాలో డిఎస్సీ అభ్యర్థులతో కలిసి ఓయూ జేఏసీ చైర్మన్ సురేష్ యాదవ్ నిరసన ప్రదర్శన చేశారు. తెలంగాణ ప్రభుత్వం 3నెలలు పోస్ట్‌పోన్ చేసి.. 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని సురేష్ యాదవ్ డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ వేస్తామని నిరుద్యోగులకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని విస్మరించిందన్నారు. డీఎస్సీ ప్రిపరేషన్‌కు టైం ఇవ్వకుండా వరుసగా పరీక్షల షెడ్యూల్ చేస్తూ విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తున్నారని దుయ్యబ ట్టారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు సమయం కేటాయించాలన్నారు. ఉద్యోగాల కోసమే బీఆర్ఎస్‌ను గద్దె దింపిన తమకు ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే తీరును వ్యవహరిస్తే గద్దె దింపడం ఖాయమని హెచ్చరించారు.
మెగా డీఎస్సీ ప్రకటించాలని డిఎస్సీ అభ్యర్థుల నిరసన
0
207
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


