హైదరాబాద్ రవీంద్రభారతిలో దివ్యాంగుల ఉద్యమ సారధి హెలెన్ కెల్లర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మలక్‌పేటలోని దివ్యాంగుల సంక్షేమ భవన్ ఆవరణలో హెలెన్ కెల్లర్ విగ్రహాన్ని సీతక్క ఆవిష్కరించారు. దివ్యాంగ విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లను అడిగి తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం దివ్యాం గుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆమె చెప్పారు. విద్యా సంస్థల్లో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేష న్లు కల్పిస్తూ జీవో ఇచ్చామన్నారు. సంక్షేమంలోనూ దివ్యాంగులకు 5 శాతం నిధులు కేటాయిస్తామన్నారు. దివ్యాంగుల పట్ల చులకన భావాన్ని వీడి గౌరవంగా మెలగాలని అన్నారు.