హుజురాబాద్‌లో రోడ్డు ఎక్కిన దళిత బంధు

    కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌లో దళిత బంధు రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో లబ్ధిదారులు రోడ్డెక్కారు. హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. అనంతరం పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో తాత్సారం చేయడం వల్లే రెండో విడత నిధులు రాలేదని దళిత బంధు సాధన సమితి నాయకులు ఆరోపించారు. దళితుల ఓట్ల కోసమే అప్పటి అధికారులతో బలవంతంగా లాంగ్ లీవ్ పెట్టించి దళిత బంధును నిలిపివేశారని అన్నారు. కౌశిక్ రెడ్డి దళిత ద్రోహి అని, ఆయనను నియోజకవర్గంలో తిరగనివ్వమని హెచ్చరించారు. ప్రస్తుత ప్రభుత్వం అయినా దళిత బంధు రెండో విడత నిధులను మంజూరు చేయాలని కోరారు. అంబేద్కర్ చౌరస్తా నుండి ర్యాలీగా వెళ్లి కేసీ క్యాంప్‌లోని ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.

Latest Articles

వరంగల్ మేయర్‌ పీఠంపై బండి సంజయ్‌ ఫోకస్‌.. జీహెచ్‌ఎంసీలో ప్రచారం లేనట్టేనా?

హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్