నేటి నుంచి సిట్‌ కస్టడీలో ప్రజ్వల్‌ రేవణ్ణ

       లైంగిక ఆరోపణల కేసులో హసన్‌ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సిట్ కస్టడీలోకి తీసుకోనుంది. ఇవాళ్టి నుంచి జూన్‌ 6 వరకు కస్టడీలో విచారించనుంది. అశ్లీల వీడియోల కేసులో ప్రజ్వల్‌ రేవణ్ణకు బెంగళూరు కోర్టు కస్టడీ విధించింది. సిట్ కస్టడీలో నిజానిజాలను రాబట్టనుంది. అశ్లీల వీడియోల కేసు లో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్‌ తన నియోజకవర్గం హాసనలో ఎన్నిక ముగియగానే విదేశాలకు వెళ్లిపో యారు. దాంతో అతడిని స్వదేశానికి రప్పించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేశారు. స్వదే శానికి వచ్చి విచారణకు సహకరించాలని జేడీఎస్ పెద్దలు దేవెగౌడ, కుమార స్వామి హెచ్చరించిన నేపథ్యంలో ఈ రోజు జర్మనీ నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చిన అతడిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బెంగళూరులోని కోర్టు ముందు హాజరుపర్చారు. పోలీసులు 14 రోజుల కస్టడీ కోరగా ప్రస్తుతం కోర్టు అతడికి ఏడు రోజుల కస్టడీ విధించింది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్