నేడు ఢిల్లీలో ఇండియా కూటమి నేతల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కూటమి నేతలు భేటీ అవుతారు. సార్వత్రిక ఎన్నికలు నేటితో ముగియ నున్నాయి. జూన్ 4న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడికానున్నాయి. దీంతో ఫలితాలతో నేతల సన్నాహకాలపై కూటమి నేతలు చర్చించనున్నారు. లోక్సభ ఎన్నికల్లో కూటమి ఐక్యత, ఎన్నికల సరళిపైనా చర్చిస్తారు. నేడు చివరి విడత ఎన్నికల కారణంగా కూటమి భేటీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరుకావడం లేదు.


