హర్యానా ఢిల్లీ మధ్య వాటర్‌ వార్‌

నీరు లేనిదే మానవ మనుగడే కాదు. సృష్టిలో ఏ జీవి బ్రతకదు. అలాంటి నీటి కోసం మొన్న బెంగళూరు, ఇప్పుడు హస్తిన వాసులు అల్లాడుతున్నారు. హర్యానా, హస్తినల మధ్య వాటర్‌ వార్‌తో నానా అవస్థలు పడుతున్నారు. ఎన్నడూ కనీవినని విధంగా వాటర్‌ వార్ వరకూ వచ్చిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

  ఓవైపు భానుడి భగభగ మరోవైపు నీటి కష్టాలు. ఇవీ దేశ రాజధాని ఢిల్లీ వాసులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులు. మొన్న బెంగళూరు, ఇప్పుడు ఢిల్లీలో అవే పరిస్థితులు. ఓ రెండ్రోజులు ముద్ద ముట్టకపోతే ఉండగలమేమో కానీ నీళ్లు తాగకుండా ఒక్క పూట గడవం కష్టమే. అలాంటి నీటి కోసం హస్తిన ప్రజలు అల్లాడిపోతున్నారు. గత కొద్ది రోజులుగా మంచినీళ్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కనీస అవసరాలు తీరక నానా అవస్తలకు గురవుతున్నారు. హర్యానా నుంచి యమునా నీటి విడుదల లేకపోవ డంతో ఢిల్లీ వాసులకు నీటికటకట తప్పడం లేదు. హర్యానా ఢిల్లీ మధ్య వాటర్‌ వార్‌ కొనసాగుతోంది. ఢిల్లీ మొత్తం యమునా నదిపై ఆధారపడి ఉండటంతో హర్యానా నుంచి వచ్చే నీళ్లే ఆధారం. అయితే, ఇరురాష్ట్రాల మధ్య నీటి వాటాలపై పంచాయితీ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే హర్యానా ప్రభుత్వం తో చర్చలు సాగిస్తున్న ఢిల్లీ సర్కార్‌. అక్కడ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో కేంద్రానికి ఫిర్యాదు చేసింది.

  మరోపక్క నగర వాసుల నీటి కష్టాలు తీర్చేందుకు ఢిల్లీ జల్‌ బోర్డు వాటర్‌ ట్యాంకర్ల ద్వారా వాటర్‌ను సరఫరా చేస్తోంది. ఈ సమయంలో నీటి కోసం జనం ఎగబడుతున్నారు. కొందరు యువకులు ట్యాంకర్ రన్నింగ్‌లో ఉండగానే పైకి ఎక్కి పైపుల ద్వారా నీళ్లు నింపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొంత మంది ఆ ప్రయత్నాలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా కొందరికి గాయాలపా లవుతున్నారు. ఈ క్రమంలోనే నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఢిల్లీ సర్కార్‌. నీటిని వృథా చేస్తే 2 వేల రూపాయల జరిమానా తప్పదని హెచ్చరించింది. అలాగే కార్లను కడగడం, ట్యాంకులు ఓవర్ ఫ్లో చేయడం, నిర్మాణం కోసం, వాణిజ్య అవసరాలకు నీటిని ఉపయోగిస్తే తీసుకుం టామని వార్నింగ్ ఇచ్చింది. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో బృందాలను ఏర్పాటు చేసింది. రోజుకు రెండు సార్లు కాకుండా సంక్షోభం కారణంగా ఒకసారే నీటిని విడుదల చేస్తామని అందుకు ప్రజలు సహకరిం చాలని కోరింది.

మరోవైపు భానుడి ప్రతాపంతో నిప్పుల వర్షం కురుస్తోంది. ఈ కారణంగానే భూగర్భ జలాలు తగ్గిపోవడంతో జనానికి నీటి కష్టాలు తప్పడం లేదు. ఢిల్లీ, చత్తీస్‌గడ్‌, మహారాష్ట్రతోపాటు పలు ప్రాంతాల్లోనూ నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరాల్లోనే కాదు పల్లెల్లోనూ నీటికి అల్లాడుతున్నారు. కిలో మీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. దీంతో వానలు పడితేకానీ నీటి కష్టాలు తప్పవని భావిస్తున్న జనం ఎప్పుడెప్పుడు వేసవికాలం పోయి వర్షాకాలం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మరి ఎన్నడూ లేని విధంగా వాటర్‌ వేస్ట్‌పై జరిమానాలు విధిస్తున్నాయి ప్రభుత్వాలు అంటే, హీట్‌ వేవ్‌తో ముందుముందు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఊహించడం కూడా కష్టమే. అందుకే ప్రకృతి వనరులు కాపాడుతూ చెట్లను పెంచడమే ఈ సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టే మార్గమంటున్నారు మేధావులు.ఇకనైనా మరి కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే వర్షాకాలంలో చెట్లను నాటు దాం. పర్యావరణ పరిరక్షణకే కాదు. నీటి సమస్యలను పరిష్కరించుకుందాం. లేదంటే భవిష్యత్తు తరాలకు ఇప్పటి కంటే 100 రెట్లు ఇబ్బందులు తప్పవని గుర్తుంచుకుందాం.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్