ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి డేట్ ఖరారైంది. జూలై 12న వీరి వివాహానికి ముహుర్తం నిశ్చయించారు. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జూలై 12 నుంచి 14 వరకు వీరి వివాహ వేడుక జరగనుంది. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక వైరల్ అవుతుంది. ఎరుపు, బంగారు వర్ణంలో రూపొందించిన వెడ్డింగ్ కార్డులు ఆకట్టుకుంటున్నాయి. వీటిని అతిథులకు పంచే కార్యక్రమాన్ని అంబానీ కుటుంబం ఇప్పటికే మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఆహ్వాన పత్రిక ప్రకారం.. మూడు రోజులపాటు వివాహ వేడుకలు జరుగనున్నాయి. జులై 12న శుభ వివాహంతో వివాహ వేడుక ప్రారంభం కానుంది. ఈవేడుకకు భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి వివాహ వేడుకకు రావాలని అతిథులను కోరారు. జూలై 13న ‘శుభ్ ఆశీర్వాద్’ సందర్భంగా అతిథులకు డ్రెస్ కోడ్‌ను ‘ఫార్మల్ ఇండియన్’గా పేర్కొన్నారు. ఇక జులై 14న జరిగే మంగళ్ ఉత్సవ్ సందర్భంగా డ్రెస్ కోడ్ ‘ఇండియన్ చిక్’గా ఉం టుంది.
అనంత్ అంబానీ వివాహ ఆహ్వాన పత్రిక వైరల్
0
386
Previous article
Next article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


