ఎన్నికల వేళ మోదీ డూప్లికేట్‌ మరింత ఫేమస్‌

   రిక్షా డ్రైవర్‌ రషీద్ అహ్మద్ మోదీలా ఉండటంతో ఫేమస్‌ అయ్యారు. అయితే, దేశవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం నెలకొన్ని వేళ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అహ్మద్‌ మోదీకి మద్దతిస్తూ మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.

  సార్వత్రిక ఎన్నికల్లో మత రాజకీయం మంటలు రేపింది. ముస్లిం రిజర్వేష్లపై కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీ వార్‌ కూడా నడించింది. అయితే, ఈ వార్‌పై స్పందించిన రషీద్‌ అహ్మద్‌ మోదీ వ్యాఖ్యలను సమర్థించారు. అవి ప్రధానమంత్రి వ్యాఖ్యలు కావని, పార్టీలో దిగువ స్థాయికి చెందినవారు మతం పేరుతో విభజనను ప్రోత్సహిస్తారని వివరించారు. ఇదిలా ఉంటే మోదీని పోలిన రూపంలో ఉండే రషీద్‌ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి చెందిన ర్యాలీలకు మోదీ డూప్లికేట్‌గా హాజరవుతుంటాడు. అయితే, అలా పలుమార్లు సభలు, ర్యాలీలకు వెళ్లానని, దానివల్ల కొంతమంది తనను, తన మోడీ రుపాన్ని చూసి వెయ్యి వరకు నగదు ఇచ్చేవారని చెప్పుకొచ్చారు. తాను రోజంతా రిక్షా నడిపినా వెయ్యే వస్తుంది. కానీ, కేవలం నేను మోడీలా ఉన్నందుకు, కొంతమంది అభిమానంతో ఇస్తారని, అందుకు కాదనలేని అన్నాడు. వాళ్ల కోసమే రోజువారి వృత్తిని పక్కనపెట్టి సభలు, ర్యాలీలకు పాల్గొంటాను కాబట్టి డబ్బులు తీసుకుంటానని వివరించాడు.

  ఇకపోతే ఢిల్లీలో నివసిస్తున్న అహ్మద్‌ను స్థానికులందరూ మా మోడీ అని పిలుచుకుంటారని..తాను మొదటి నుంచి ఇలాగే ఉన్నానని, అయితే, మోదీ ప్రధాని అయ్యాక తన గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరిగిందన్నాడు అహ్మద్‌. ఆయనలాగే పోలికలు ఉండటం, తెల్ల జుట్టు, గడ్డం, మోడీ తరహాలో దుస్తులు ధరించడం వల్ల తాను ఎక్కువ ఫేమస్ అయినట్టు చెప్పుకొచ్చాడు. కేవలం రెండు గదుల ఇంట్లో భార్య పిల్లలు, మనవరాళ్లతో నివసిస్తున్న తనను, చుట్టుపక్కల జనం కలిసేందుకు, అతనితో ఫోటోలు దింగేందుకు ఆసక్తి చూపిస్తారని అన్నాడు. తాను రిక్షా డ్రైవర్ కావడంతో చాలామంది పిల్లలు అతని రిక్షాలోనే స్కూళ్లకు వెళ్తారని, వారంతా అహ్మద్‌ను ‘మోడీ అంకుల్’ అనే పిలుస్తారని తెలిపాడు.

Latest Articles

మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు- మంత్రి నారాయణ

జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి నారాయణ అన్నారు. మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్