నిర్మల్ జిల్లా భైంసాలో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫిర్యాదు దాఖలైంది. ఎన్నికల సందర్భంగా గురువారం బీఆర్ ఎస్ రోడ్ షోలో పాల్గొన్న కేటీఆర్ అక్కడ హనుమాన్ స్వాములు నిర్వహి స్తున్న నిరసన పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నిరసన ఆపుతారా లేదా అంటూ పోలీసులను ఉద్దే శించి “పోలీసులు ఉన్నారా! చచ్చిపోయారా.! .మీకు చేత కాదా” అని మండిపడ్డారు. కేటీఆర్ పోలీసుల పై అనుచిత వ్యాఖ్యలుచేశారని ఆరోపిస్తూ భైంసా అడ్వకేట్లు బీజేపి నాయకులు తాడివార్ సాయినాథ్, ప్రవీణ్ కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐ కి ఫిర్యాదు చేశారు.
రోడ్ షో సందర్భంగా పోలీసులపై కేటీఆర్ ఆగ్రహం
0
490
Previous article
Next article
Latest Articles
నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అవినీతి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో, కార్యాలయంలో ఒకేసారి తనిఖీలు...
- Advertisement -
- Advertisement -


