భూ వివాదంలో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని దారుణంగా కొట్టుకున్న సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మేడ్చల్ మండలంలోని మైసిరెడ్డిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో రెండు గ్రూపుల మధ్య భూవివాదం నెలకొంది. దీంతో ఓ వర్గం వారు కొంతమంది రౌడి మూకలను తీసుకొచ్చి, మరో వర్గంపై దాడి చేయించింది. దీంతో రెండు గ్రూపులు కర్రలు, రాడ్లతో దాడి చేసుకున్నారు. ఈఘటనలో పలువురు తీవ్రంగా గాయపడడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరో ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. భూ యజమాని ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు గొడ్డలి, కర్రలు, కత్తి వంటి మారణాయు ధాలను స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మేడ్చల్ జిల్లా మైసిరెడ్డిపల్లిలో భూవివాదం
0
517
Previous article
Next article
Latest Articles
210 కిలోల నందిని పాలపొడి పట్టివేత!
కర్ణాటక ప్రభుత్వం చిన్నారుల కోసం అమలు చేస్తున్న ఉచిత పాల పథకానికి చెందిన నందిని పాలపొడి అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలోని ఆలేరు వద్ద ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో 210 కిలోల...
- Advertisement -
- Advertisement -


