దేశంలో బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టి, బిసి, మైనార్టీలకు తిప్పలు తప్పవని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం కలిగినదని, ఈ పార్టీలో అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటుందని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీరామ్ నగర్ లో ఆయన ర్యాలీ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీ నాథ్ అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. మరోవైపు నియోజకవర్గ అభివృద్ధిని మరచి నేరగాళ్ల అభివృద్ధిని ఆయన ఆకాంక్షించారని ఆరోపించారు. రౌడీ షీటర్లను పెంచి పోషించి తన వ్యతిరేకులపై దాడి చేయించిన దుర్మార్గుడు మాగంటి గోపీనాథ్ అని ఆయన దుయ్యబట్టారు.
బిజెపికి భయపడేదే లేదు: దానం నాగేందర్
0
203
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


