తెలంగాణలో మండిపోతున్న ఎండలు

    తెలుగు రాష్ట్రాలు ఎండలతో మండిపోతోంది. రోజురోజుకు పెరుగుతూ వస్తున్న ఉష్ణొగ్రతలతో తెలంగాణ ప్రాంతం నిప్పులకుంపట్లో కుతకుతలాడుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు, వేడిగాలుల తీవ్రత పెరుగుతోంది. అసాధారణ వాతావరణ పరిస్థితుల మధ్య జనం ఉక్కిరి బిక్కిరవు తున్నారు. మరో నాలుగైదు రోజులపాటు రాష్ట్రంలో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలకు ఉష్ణోగ్ర తలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత కొనసాగడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. పది నిమిషాలు బయటికి వెళ్తేచాలు బాడీ హీటెక్కిపోతుంది. ఓవైపు భానుడి భగభగ మరోవైపు విపరీతమైన వేడిగాలులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రోజరోజుకు ఎండలు పెరిగి రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతు న్నాయి.

    తెలంగాణలో నాలుగురోజులుగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. 42 డిగ్రీలు రికార్డు అవుతేనే వామ్మో ఎండలు అనుకుంటే, ఇప్పుడు 45, 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లాలో 46.2, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సిద్దిపేట జిల్లా ధూల్‌మిట్టలో 45.9 డిగ్రీలు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది.రాబోయే ఐదురోజుల పాటు రాష్ట్రంలో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో వడగాలులు వీస్తాయని, ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ను ప్రకటించింది. ఇప్పటికే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌తోపాటుగా ఒడిశా, పశ్చిమ బెంగాల్,బీహర్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండి తెలంగాణకు కూడా తీవ్ర మైన హెచ్చరికే జారీ జేసింది. రెండు రోజులుగా వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో ఉత్తర తెలంగాణతోపాటు దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాలు ఎండల తో మండిపోతున్నాయి. వడగాల్పుల తీవ్రతతో జనం బెంబేలెత్తిపోతున్నారు.

  నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, హనుమకొండ, మహబూబా బాద్‌, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఎండల తీవ్రతతో జనాలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ప్రధాన రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. పగటి పూట జన సంచారం తగ్గింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దం టున్నారు అధికారులు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46డిగ్రీలపైగానే నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా గూడాపూర్‌లో 46. 6డిగ్రీలు నమోదయ్యాయి. చందూరు, మంగపేట, భద్రాచలం, మునగాల తదితర ప్రాంతాల్లో 46.5 డిగ్రీలు నమోదయ్యాయి. తిమ్మాపూర్, వైరా, ఖనా పూర్, ముత్తారం, వెల్గటూర్ ప్రాంతాల్లో కూడా 46.4 డిగ్రీలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

   ఏపీలో ఈ రోజు అత్యథిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ,కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగినిన కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 43 డిగ్రీల మధ్యలో రికార్డు అవుతా యని అంచనా వేస్తున్నారు. ఏపీలోని 31 మండలాల్లో తీవ్ర వడగాలులు, 234 మండలాల్లో వడగా లులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో నిన్న 79 మండలాల్లో తీవ్ర వడగాలులు వీయగా 118 మండలాల్లో వడగాలులు వీచాయి. రాష్ట్రంలో ఏకంగా 21 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. రాష్ట్రంలో అత్యధికంగా పల్నాడు జిల్లా కొప్పునూరులో 46.2, తిరుపతి జిల్లా మంగనెల్లూరు 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎన్టీఆర్‌ జిల్లా చిలకల్లులో 45.8, నంద్యాల జిల్లా బనగానపల్లిలో 45.7 డిగ్రీలు నెల్లూరు జిల్లా మర్రిపాడులో 45.7 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా కొత్తపల్లిలో 45.6 డిగ్రీలు ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్ర తలు నమోదయ్యాయి.

   ఎండలు పెరగడంతో ప్రజలు జాగ్రతలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య అయితే బయటికి రాకపోవడమే బెటర్ అంటున్నారు. పగటి పూట బయటకు రావాల్సి వస్తే, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మే నెల ప్రారంభం కావటం తో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 50డిగ్రీలను తాకే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండా లని, మధ్యాహ్నం వేల బయటకు వెళ్లొద్దని సూచించింది. ఈ నెల 6 వరకు కర్ణాటక, ఏపీ, తెలంగాణ, పుదుచ్చేరిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని సూచించింది. మే4 వరకు జార్ఖండ్‌ లో మే 3 వరకు కేరళ, తమిళనాడులో ఎండల తీవ్రత ఉంటుంది. మే5 వరకు పశ్చిమ బెంగాల్, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్రలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్