బీఆర్ఎస్ నేత, ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఉస్మానియా యూనివర్సిటీ మెస్‌ల మూసివేత, సెలవులపై దుష్ప్రచారం చేసిన కేసులో క్రిశాంక్‌తోపాటు, ఓయూ విద్యార్థి నాయకుడు నాగేందర్‌ను పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ వర్సిటీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా దుష్ప్రచారం చేశారన్న ఓయూ అధికారుల ఫిర్యాదుపై వివిధ సెక్షన్ల కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిన్న హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళ్తున్న వీరిద్దరినీ పంతంగి టోల్‌గేట్ వద్ద అరెస్ట్ చేశారు. ఈ కేసులో క్రిశాంక్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఉస్మానియా యూనివర్సిటీలో నీరు, కరెంట్ సమస్యలపై నకిలీ నోటీసులు సృష్టించి వర్సిటీ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఓయూ చీఫ్ వార్డెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రిశాంక్‌పై ఓయూ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం ఈస్ట్ మారేడ్‌పల్లిలోని జడ్జి ముందు హాజరు పరిచారు. క్రిశాంక్‌కు న్యాయమూర్తి 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండు విధించారు. దీంతో క్రిశాంక్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు క్రిశాంత్ అరెస్ట్‌పై బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్‌లు తీవ్రంగా స్పందించారు. క్రిశాంక్‌ను అరెస్టును ఖండించారు. క్రిశాంక్‌ను అరెస్టు చేయడం అక్రమమని, గల్లీ కాంగ్రెస్ వైఫల్యాలు, ఢిల్లీ బీజేపీ అరాచకాలపై గొంతెత్తినందుకే ఆయనపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నాడనే కక్షతో బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ పై అక్రమ కేసులు బనాయించి వేదింపులకు గురిచేస్తోందని మండిపడ్డారు.


