ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా పడింది. ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు కొనసాగగా ఇవాళ్టికి తీర్పును వాయిదా వేసింది. ఇవాళ మళ్లీ తీర్పును మే6కు వాయిదా వేసింది కోర్టు. ఈడీ, సీబీఐ లిక్కర్ కేసుల్లోనూ కవిత బెయిల్‌పై తీర్పును ఈనెల 6న వెలువరిం చనున్నారు. ఈ కేసులో సీబీఐ తనను అక్రమంగా అరెస్టు చేసిందని, తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాల ని గతంలో ఆమె పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం తిరస్కరించింది. ఆ తర్వాత సాధారణ బెయిల్ కోసం మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చివరిసారిగా గత నెల 22న రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి.
ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులకు అరెస్టు అవసరం లేదని, కవిత మహిళ కాబట్టి పీఎంఎల్‌ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్‌కు అర్హురాలని ఆమె తరఫున న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టులో వాదనలు వినిపించా రు. సరైన ఆధారాలే లేని ఈ కేసులో ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితదే కీలక పాత్రని, కేసు దర్యాప్తు జరుగుతోందని, ఆమె బయటికి వస్తే కేసును ప్రభావితం చేస్తారని, కాబట్టి బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ తరఫు న్యాయవాది పంకజ్ గుప్తా వాదించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కావేరి భవేజ తీర్పును ఇవాళ్టికి రిజర్వు చేయగా.. తీర్పును మే6 కు వాయిదా వేశారు. ఇక మనీలాండరింగ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 6న తీర్పు రానుంది. ఆమె జ్యుడీషియల్ కస్టడీ ఈ నెల 7వ తేదీతో ముగియనుంది.


