మరో 5 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం

   తెలుగురాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఎన్నికల వేడి ఓవైపు.. ఎండల వేడి మరోవైపు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత పెరుగుతోంది. దాదాపు 40 డిగ్రీల ఎండ ఉష్ణోగ్రతలు నమోదుతు న్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీలను దాడి నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అవసరమైతేనే బయటికి రావాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

మరోవైపు రానున్న మరో 5 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలో వేడిగాలుల వీస్తాయని, కరీంనగర్, నల్గొండ, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, వనపర్తి, యాదాద్రి, రంగా రెడ్డి, జిల్లాలకు రెడ్ అలర్డ్ జారీ చేసింది. ఏకంగా 8 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు రికార్డు అవుతున్నాయి. దాంతో ఎండ వేడిమికి తాళలేక జనాలు బయటికి రావడం లేదు. పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3-5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతుండగా.. వచ్చే ఐదు రోజుల్లో మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశాలున్నాయి. 45 డిగ్రీలు దాటిన కరీంనగర్‌, పెద్దపల్లి, నల్గొండ, జగిత్యాల, యాదాద్రి, వరంగల్‌, వనపర్తి జిల్లాలకు ‘రెడ్‌’ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ 25 జిల్లాలకు ‘ఆరెంజ్‌’ ప్రకటించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 5 గంటల వరకు బయటకు రావద్దని విజ్ఞప్తి చేసింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన ఉష్ణోగ్రతలతో పోల్చితే 5-7 డిగ్రీలు మించి ఉంటున్నాయి. సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రతలకు రెండు డిగ్రీలు పెరిగితేనే ప్రజలు అల్లాడి పోతారు. మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్‌, కామారెడ్డిలో తీవ్రమైన వడగాలులు కొనసాగుతాయని అధికారుల తెలిపారు. నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, గద్వాలలో వడగాలులు వీస్తాయి.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్