జహీరా’బాద్’షా ఎవరు?

 జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో లోక్ సభ ఎన్నికల హీట్ మొదలైంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మూడు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇంతకీ అక్కడ నెగ్గే దేవరు? తగ్గేదెవరు?ఈ ఎన్నికల్లో జహీరాబాద్ బాద్ షా ఎవరు ?

 2008లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడింది. ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, నారాయణ్ ఖేడ్, ఆంథోల్, జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. మొత్తం 14 లక్షల 45 వేల పైచిలుకు ఓటర్లు. 2009లో తొలిసారి ఈ నియోజకవర్గానికి ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ గెలుపొందారు. ఆ 2014, 2019 లో జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్. ఈ సారి కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కార్, బీజేపీ నుంచి బీబీ పాటిల్, బిఆర్ ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ బరిలో ఉన్నారు.

  ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ బాద్ షా ఎవరు ? అన్నదే హాట్ టాపిక్. ఇప్పటికి రెండు సార్లు గెలిచిన బిబి పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదనే ప్రచారం జరుగుతోంది. బీబీ పాటిల్ రెండు సార్లు టీఆరెస్ నుంచి గెలిచారు. తాజాగా బిజెపి లో చేరి పోటీ చేస్తున్నారు. వ్యాపార వేత్త అయిన బిబి పాటిల్ ఈ పదేళ్ల లో ఎప్పుడు ప్రజలకు అందుబాటులో లేరన్న వాదన వినిపిస్తోంది. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి లేదు. ఒక్క పరిశ్రమ కూడా స్థాపించలేదన్న వాదన ఉంది. ఇన్నాళ్లు పార్టీనే నమ్ముకున్న వారికి కాదని బీబీ పాటిల్ కి టికెట్ ఇవ్వడంపై బీజేపీ క్యాడర్ లో కొంత నిరాశ ఉంది. అటు కామారెడ్డి బిజెపి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి కూడా బిబి పాటిల్ ను అభ్యర్ధిగా ప్రకటించటం పట్ల అసంతృప్తి వ్యక్తంచేశారని తెలిసింది. తెలుగు భాష రాకపోవటం ఈ సారి బీబీ పాటిల్ సమస్యే . ఇక్కడ లింగాయత్ ల ప్రభావం ఉంటుంది. బీబీ పాటిల్ కూడా లింగాయత్ కు చెందిన వారే.

  కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ కు ఈ నియోజకవర్గంలో మంచి పేరుంది. షెట్కార్ ఎంపీగా ఉన్న 2009 -14 వరకు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో షెట్కార్ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేశారన్న పేరుంది. షెట్కార్ కూడా లింగాయత్ వర్గమే… తెలుగు స్పష్టంగా మాట్లాడతారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం షెట్కార్ కు కలిసొచ్చే అంశం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోడో యాత్ర కూడా జుక్కల్ నియోజకవర్గం మీదుగా సాగింది. మరోవైపు జుక్కల్, ఎల్లారెడ్డి, ఆంథోల్, నారాయణ్ ఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది సురేష్ షెట్కార్ కు కలిసొస్తుందంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన రాజకీయ మార్పుల దృష్ట్యా గతంలో షెట్కార్ ఓటమి పాలయ్యారు. ఈ సారి షెట్కార్ కు గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.

బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ బరిలో ఉన్నారు. మొదటి సారిగా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అనిల్ కుమార్. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. గాలి కూడా గట్టి పోటీనే ఇస్తున్నారంటున్నారు. బీసీ ఓట్లు, మున్నూరు కాపు ఓట్లు ఈయన విజయంలో కీలక పాత్ర వహిస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పరిస్థితులు క్షణక్షణం మారుతు న్నాయి. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. జహీరాబాద్ కా బాద్ షా ఎవరో చూడాలి.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్