మేమంతా సిద్ధం వైసీపీ బస్సుయాత్ర నేటితో ఎండ్

    ఏపీ సీఎం జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కాసేపట్లో ప్రారంభ కానుంది. బస్సు యాత్ర ఇవాళ్టితో ముగియనుంది. టెక్కలిలో జరిగే బహిరంగ సభతో తొలి విడత యాత్ర ముగుస్తుంది. దీంతో టెక్కలి ముగింపు సభకు భారీ జనసమీకరణ చేస్తోంది వైసీపీ. యాత్రలో భాగంగా అక్కివలస నుంచి బయల్దేరబోతున్నారు సీఎం జగన్‌. అక్కడి నుంచి ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం బైపాస్, నరసన్నపేట బైపాస్, కోటబొమ్మాళి, కన్నెవలస మీదుగా పరశురాంపురం జంక్షన్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కె.కొత్తూరు మీదుగా టెక్కలి వద్దకు చేరుకొని, అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్‌ ప్రసంగిస్తారు.

   ఇక సభ ముగియగానే సీఎం జగన్‌ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. సార్వత్రిక ఎన్నికల్లో తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం జగన్‌.. గతనెల 27న ఇడుపుల పాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించి యాత్ర ప్రారంభించారు. అడుగడుగునా ప్రజలకు భరోసా ఇస్తూ యాత్ర కొనసాగించారు. ఇప్పటి వరకు 21 రోజుల పాటు 22 జిల్లాల్లో యాత్ర కొనసాగింది. 15 చోట్ల భారీ బహిరంగ సభల్లో ప్రసంగించారు సీఎం జగన్‌.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్