రసవత్తరంగా ఖమ్మం కాంగ్రెస్‌ పాలిటిక్స్‌

        ఖమ్మం కాంగ్రెస్‌ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇంతవరకు కాంగ్రెస్‌ మూడు స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. ఇందులో హైదరాబాద్‌, కరీంనగర్‌ స్థానాలపై క్లారిటీ వచ్చేసింది. కానీ ఖమ్మం అభ్యర్థిపై ఇంకా తర్జనభర్జన పడుతోంది. అధిష్ఠానం అధికారికంగా ప్రకటించక పోయినా ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన తరఫున మద్దతుదార్లు రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ వీవీ గౌతమ్‌కు రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలు అందజేశారు. వాటిలో ఆయనను కాంగ్రెస్‌ అభ్యర్థిగా పేర్కొన్నారు. ఆయనతో పాటు పార్టీ నాయకుడు రాయల నాగేశ్వరరావు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వ రరావు పేర్లు అధిష్ఠానం పరిశీలనలో ఉన్నాయి. పొంగులేటి వియ్యంకుడు నామినేషన్ వేయడంతో ప్రియాంక గాంధీని ఖమ్మం బరిలో దింపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుబడు తున్నట్లు సమాచారం. ఖర్గేతో భేటీ అనంతరం కొత్తగా ప్రియాంకను నిలబెట్టాలనే డిమాండ్‌ అధిష్టానం ముందుం చారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్