పంజాబ్ ఎన్నికల్లో నాలుగు స్తంభాలాట

   లోక్ సభ ఎన్నికల వేళ.. పంజాబ్ లో చిత్రమైన పరిస్థితి. మిత్రులే కత్తులు దూస్తున్నారు. ఎంతో కాలంగా మిత్రపక్షంగా ఉన్న బీజేపీ, శిరోమణి అకాలీదళ్ విడివిడిగా పోటీ చేస్తుంటే.. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉంటూనే. ఆమ్ ఆద్మీపార్టీ, కాంగ్రెస్ విడివిడిగా పోటీచేస్తున్నాయి. పంజాబ్ లో అటు బీజేపీ, ఇటు ఆమ్ ఆద్మీపార్టీ, మరో పక్క కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ కూడా ఒంటరి పోరుకు సిద్ధమయ్యాయి. దీంతో చతుర్ముఖ పోటీలు తప్పని పరిస్థితి.

   పంజాబ్ లో 2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలన్నీ.. రైతులు, రైతు సమస్యలు చుట్టూ తిరుగుతు న్నాయి. ఎన్నికల ఫలితాలను నిర్ణయించేది రైతులే కావడంతో అన్ని పార్టీల ఎజెండా రైతు సమస్యలే అయ్యాయి. శిరోమణి అకాలీదళ్ రైతులకోసం బీజేపీతో దోస్తీ వదులుకుంటే.. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే.. రైతు వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని స్పష్టం చేస్తూ..పంజాబ్ లో ఎన్నికల గోదాలో దిగింది. బీజేపీ కూడా రైతుల ప్రయోజనాలకే కృషి చేస్తామని, రైతుల కోసమే పలు పథకాలు పెట్టామని అంటోంది. 2024 లోక్ సభ ఎన్నికలు పంజాబ్ లో మొత్తం 13 నియోజకవర్గాలలోనూ ఒకే సారి జూన్ 1న అంటే చివరి దశలో జరుగుతాయి. అమ్ ఆద్మీపార్టీ, బీజేపీ, అకాలీదళ్, కాంగ్రెస్ కూడా అన్ని నియోజకవర్గాల్లో అమీ తుమీ తేల్చుకోవడానికే సిద్ధమయ్యాయి.

   పంజాబ్ లో ఒకప్పటి మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ తో మళ్లీ పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. స్నేహహస్తం అందించేందుకు ఎస్ఏడి రెండు షరతులు విధించింది. ఒకటి పంజాబ్ రైతుల ప్రధాన డిమాండ్ వ్యవసాయ ఉత్పత్తుల కనీసమద్దతు ధరకు చట్ట బద్ధత కల్పించడం. బందీ సిక్కుల విడుదలకు కేంద్రం జోక్యం కల్పించుకుని, వారికి విముక్తి కల్పించడం. ఈ షరతులను అంగీకరించేందుకు బీజేపీ సంసిద్ధత వ్యక్తం చేయకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. పంజాబ్ లో జైలు శిక్ష పూర్తి చేసుకున్న సిక్కుల అంశం ఓ కీలక సమస్య. దేశంలో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడి దేశం వివిధ జైళ్లలో మగ్గుతున్న సిక్కు ఖైదీలను బందీ సిక్కులుగా వ్యవహరిస్తారు. వారిలో చాలా మంది శిక్షాకాలం పూర్తి చేసుకున్నా విడుదలైన దాఖలాలు లేవు. వారి విడుదలకు కేంద్రం జోక్యం చేసుకోవా లన్నది అకాలీదళ్ ప్రధాన డిమాండ్. బేషరతుగా సీట్లు సర్దుబాటు చేసుకోవాలన్న బీజేపీ డిమాండ్ ను కూడా అకాలీదళ్ తిరస్కరించింది.

   రైతుల ప్రయోజనాలు, ఖల్సా పంత్, అన్ని మైనారిటీలు, పంజాబీల ప్రయోజనాల కోసం ఛాంపియన్ గా నిలుస్తామని , దానినుంచి వెనక్కితగ్గే ప్రసక్తి లేదని ఎస్ఏడే చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ స్పష్టం చేశారు. పంజాబ్ లో బీజేపీ – ఎస్ ఏడీ ప్రభుత్వం రెండు టర్మ్ లు సజావుగా సాగింది. 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత తో అధికారానికి దూరమైంది. అకాలీదళ్, బీజేపీ మధ్య ఏర్పడిన ఖాళీని పూడ్చే క్రమంలో 2022లో అనూహ్యంగా ఆమ్ ఆద్మీపార్టీ అధికారంలోకివచ్చింది. పంజాబ్ లో ముఖ్యంగా వలస, దళిత జనాభా గణనీయంగా ఉన్న లుధియానా- జలంధర్ పారిశ్రామిక ప్రాంతంలో బీజేపీ వేళ్లూను కుంటోంది. కాంగ్రెస్ ఎంపీ రవ్నీత్ సింగ్ బిట్టు, ఆప్ అభ్యర్థి సుశీల్ కుమార్ రింకూ ఈ ప్రాంతానికి చెందిన వారే. 66% హిందూ జనాభా ఉన్న లుధియానా బిజెపి విస్తరించింది. ముఖ్యంగా రైతుల ఉద్యమం, శిరోమణి అకాలీదళ్ తో పొత్తు విచ్ఛిన్నమైన తరువాత రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ కుదేలై పోయింది.

    బీజేపీ, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ను చీల్చి ఆప్ లబ్ధి పొందింది. బీజేపీకి మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ , పాటియాలా ఎంపీ ప్రణీత్ కౌర్, రవ్ నీత్ సింగ్ బిట్టు, ఆమ్ ఆద్మీనుంచి ఎన్నికై బీజేపీలో చేరిన సుశీల్ కుమార్ రింకు వంటి ఎంపీల అండ ఉంది. రింకూ హిందూ దళిత్. రాష్రంలో 33 శాతం షెడ్యూల్ కులాలవారు అటు సిక్కుల్లోనో. ఇటు హిందువుల్లోనే ఉన్నారు. వారి ఓట్లను ఆకట్టుకు నేందుకు బీజేపీ కృషి చేస్తోంది. అయితే రైతు కమ్యునిటీలో బీజేపీకి ఉన్న వ్యతిరేకతతో లబ్ధి పొందాలని ఆప్, కాంగ్రెస్ చూస్తుంటే.. బీజేపీ కూడా నాలుగు స్థంభాల ఆటలో తాను ప్రయోజనం పొందగలననే ఆశతో ఉంది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్