ఉగాది పండుగ సందర్బంగా చాలా సినిమాల ప్రకటనలు వెలువడ్డాయి. అందులో ఒకటి ‘ఏ మాస్టర్ పీస్’. మాటరాని మౌనమిది, శుక్ర చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు సుకు పూర్వజ్. ఆయన తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఏ మాస్టర్ పీస్’. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, ఆషు రెడ్డి, శివ మాధవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో మెర్జ్ ఎక్స్ ఆర్ భాగస్వామి అయ్యింది. ఈ సంస్థతో కలిసి సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల “ఏ మాస్టర్ పీస్” సినిమాను నిర్మిస్తున్నారు. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఈ అనౌన్స్ మెంట్ చేశారు.
‘ఏ మాస్టర్ పీస్’ సినిమా మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలిసిన ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది. అద్భుతమైన విజువల్స్, భారీ మేకింగ్, విజువల్ ఎఫెక్టులతో “ఏ మాస్టర్ పీస్” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా భారీ క్లైమాక్స్ మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హై స్టాండర్డ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో యూనిక్ సూపర్ హీరో ఫిల్మ్ గా “ఏ మాస్టర్ పీస్” ఉండబోతోంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలవుతూ పాన్ ఇండియా సినిమాగా రాబోతోంది. ఈ సినిమాలో స్నేహ గుప్త, అర్చనా అనంత్, జయప్రకాశ్, చందు, మనీష్ గిలాడ తదితరులు నటిస్తున్నారు.


