తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు

రోహిణి కార్తెలో రోళ్లు కూడా బద్దలవుతాయనే నానుడి ఉంది. ఈసారి భానుడి ప్రతాపాన్ని చూస్తే, ఆ పరిస్థితి ముందే వచ్చిందనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 దాటక ముందే భానుడు భగభగలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అన్ని జిల్లాల్లో వడగాలులు వీస్తుండ డంతో..ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను దాటేస్తున్నాయి. ఒకవైపు మండే ఎండలు… మరొక వైపు ఉక్కపోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

       మండే ఎండలకు తోడు ఈసారి విచిత్రమైన వాతావరణ పరిస్థితి నెలకొని ఉంది. నమోదవుతున్న ఉష్ణో గ్రతల కంటే ఎండ వేడిమి ఎక్కువగా ఉంటోంది. గాలిలో తేమ శాతం పెరగడమే ఇందుకు కారణం. తేమ శాతం పెరిగే కొద్దీ ఎండ వేడిమి కూడా తీవ్రంగా ఉంటుంది. దీని వల్ల ఉక్కపోత ఎక్కువవుతుంది. మండే ఎండలకు తోడు ఉక్కపోత మరింత పెరుగుతండడంతో సామాన్య ప్రజలు బయటకు రావాలం టేనే జంకుతున్నారు.ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్‌నినో ప్రభావం 2023 జూలై నుంచి కొనసాగుతోంది. దీని ప్రభావంతో గత వర్షాకాలంలో ఎక్కువగా వర్షాలు కురవలేదు. 2023 ఆగస్టులో ఎప్పుడూ చూడని పరిస్థితి నెలకొంది. మార్చి నెల నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఇక మేలో ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని సామాన్యుడు బెంబే లెత్తిపోతు న్నాడు. ఎండలో పని చేసేవారు, మధ్యాహ్నం పూట ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు బయటకు రావొద్దని హెచ్చరిస్తు న్నారు. నీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవాలని సూచిస్తున్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్