వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో దూకుడు పెంచారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ బస్సు యాత్ర పది రోజులుగా కొనసాగుతోంది. జగన్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు, యువత, కార్మిక సంఘాలు జగన్ యాత్రకు స్వాగతం పలుకుతు న్నారు. 11వ రోజు ప్రకాశం జిల్లా వెంకటాచలం పల్లె నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. వెంకటాచ లంపల్లి దగ్గర పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అనంతరం బొదనం పాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అక్కడి నుంచి చీకటిగల పాలెం మీదుగా వినుకొండకు 3 గంటలకు చేరుకుని రోడ్ షో కార్యక్రమం లో పాల్గొంటారు. తరువాత కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెం రాత్రి బసకు చేరు కుంటారు.
నేడు 11వ రోజు కొనసాగనున్న జగన్ బస్సు యాత్ర
0
304
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


